: ఒడిశాలో తలదాచుకున్న రాధిక కిడ్నాప్ నిందితుడు


వివాహిత రాధికను కిడ్నాప్ చేసి రూ. 3 లక్షలు ఇవ్వకుంటే, ముంబైలో అమ్మేస్తానని దుండగుడు చేసిన వాట్సాప్ ఫోన్ కాల్ పోలీసులకు కీలక క్లూను అందించింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు ఒడిశాలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రత్యేక బృందాలను విమానంలో పంపించారు. బాధితురాలిని రక్షించాలన్న ఏకైక లక్ష్యంతో స్పెషల్ ఎస్ఓటీ పోలీసులు బయలుదేరి వెళ్లారు. కాగా, ఈ నెల 6న గుడికి వెళ్లి వస్తానని చెప్పిన రాధికను దుండగుడు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. రాధికను నిర్బంధించిన అతడు ఆమెను గాయపరచడమే కాకుండా, శరీరం నుంచి రక్తం కారుతున్న దృశ్యాలను వాట్స్ యాప్ లో పెట్టడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News