: ఫుట్ బాల్ వదిలి టెన్నిస్ బాల్ పట్టిన డేవిడ్ బెక్ హామ్!


వింబుల్డన్ సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పురుషుల సెమీఫైనల్స్ పోరును చూసేందుకు వచ్చిన ఫుట్ బాల్ సూపర్ స్టార్ డేవిడ్ బెక్ హామ్ టెన్నిస్ బంతిని ఒడిసి పట్టి అందరి చూపూ తనవైపు తిప్పుకున్నాడు. జమీ ముర్రే, జాన్ పీర్స్ జోడీ జొనాథన్ ఎర్లిచ్, ఫిలిప్ జంటతో పోటీ పడగా, ఆటగాడు కొట్టిన బంతి బెక్ హాం కూర్చున్న రాయల్ బాక్స్ వైపు దూసుకొచ్చింది. నేర్పుగా ఆ బంతిని పట్టుకున్న బెక్ హాంపై వింబుల్డన్ ట్విట్టర్ పేజీలో పోస్టులు వెల్లువెత్తాయి. మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత ఆటగాళ్లు, అభిమానులు ఆయనపై సరదా ట్వీట్లను గుప్పించారు.

  • Loading...

More Telugu News