: తెలుగు కాదు... హిందీ 'బాహుబలి' పైరసీ హల్ చల్
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రం విషయంలో నిర్మాతలు భయపడ్డట్టే పైరసీ అయింది. ఈ చిత్రం తెలుగు వర్షన్ పైరసీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న చిత్ర నిర్మాతలు, హిందీ, తమిళ వర్షన్లను పట్టించుకున్నట్టు లేదు. దీంతో అక్రమార్కులు బాహుబలిని రికార్డు చేసి ఇంటర్నెట్ లో ఉంచారు. హిందీ వర్షన్ పైరసీ నెట్లో హల్ చల్ చేస్తోంది. ఉత్తరాదిలో నిఘా బలహీనంగా ఉండడం వారికి లాభించింది. పైరసీ లింకులు శరవేగంగా విస్తరిస్తుండగా, ఇవి ఎక్కడ కనిపిస్తే అక్కడి నుంచి డిలీట్ చేసే పనిలో ఓ టీం నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది.