: అమేధీలో 'మేనల్లుడి' పర్యటన
రాహుల్ గాంధీ మేనల్లుడు అమేధీలో సందడి చేశాడు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా అమేధీ నియోజకవర్గానికి విచ్చేశాడు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చిన రెహాన్, స్థానికుల ఇళ్లలో గడిపాడు. అక్కడే భోజనం చేశాడు. అక్కడే నిద్రించాడు. అనంతరం తనకు భోజనం పెట్టి, ఆదరించిన కుటుంబంతో ఫోటోలు దిగాడు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫోటోల్లో రెహాన్ స్నేహితుడు, భోజనం, పరిసరాలపై అయిష్టత వ్యక్తం చేస్తుండగా; రెహాన్ మాత్రం అద్భుతం అన్నట్టు రోటీ తింటున్నాడు. మొత్తానికి రేహాన్ కి మేనమామ లక్షణాలు వచ్చినట్టే కనబడుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.