: ముఖ్యమంత్రి కేసీఆర్ తిక్క పనులు చేస్తున్నాడు: సీపీఎం నేత తమ్మినేని
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తిక్క పనులు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని ఊడ్చివేయడానికి పారిశుద్ధ్య కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు సంఘీభావం ప్రకటించిన ఆయన కార్మికులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. కార్మికులు లేకుండా స్వచ్ఛ భారత్ సాధించడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. చీపుర్లు పట్టుకుని ఫొటోలు దిగితే సరిపోదని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కంపు కొడుతోందని... దీనికంతటికీ కారణం కేసీఆరే అని ఎద్దేవా చేశారు.