: కెప్టెన్ కూల్ ను చూసే నేర్చుకున్నానంటున్న అంబటి రాయుడు!


జింబాబ్వేతో నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు వీర విహారం చేశాడు. అజేయ సెంచరీతో టీమిండియాకు ఒంటిచేత్తో విజయం అందించాడు. కుర్రాళ్లతో వెళ్లిన టీమిండియా నిన్నటి మ్యాచ్ లో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచింది. చివరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరకు టీమిండియానే విజయం వరించింది. అంత ఒత్తిడిలోనూ కుర్రాళ్లు బాగానే అడారంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. వారిలో ఈ తరహా నైపుణ్యం పెంపొందడానికి కారణమేంటని అంతా ఆరా తీస్తుంటే, నిన్నటి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రాయుడు సూటి సమాధానం చెప్పేశాడు. టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచే తాను ఇదంతా నేర్చుకున్నానని అతడు ప్రకటించాడు.

  • Loading...

More Telugu News