: ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే... అశోక్ బాబు ఎక్కడ దాక్కున్నారు?: సీపీఎం


రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే... ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఎక్కడ దాక్కున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ అశోక్ బాబు వత్తాసు పలకడం మంచిది కాదని అన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడం అత్యంత దారుణమని... ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, కృష్ణా జిల్లా ముసునూరులో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. మహిళా ఉద్యోగిపై దాడి చేసిన చింతమనేనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News