: రాజమండ్రిలో లేడీ కానిస్టేబుళ్ల ధర్నా...వసతులు లేకుంటే పుష్కరాల విధులను బహిష్కరిస్తామని హెచ్చరిక


పుష్కరాలకు సంబంధించిన శాంతి భద్రతల విధులకు వచ్చిన మహిళా కానిస్టేబుళ్లు రాజమండ్రిలో ధర్నాకు దిగారు. వీరికి నగరంలోని రాజలక్ష్మి కళాశాలలో అధికారులు వసతి కల్పించారు. అయితే కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని మహిళా కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు సమస్యను నివేదించినా ఫలితం లేకపోవడంతో మహిళా కానిస్టేబుళ్లు ధర్నాకు దిగారు. కనీస సౌకర్యాలను కూడా కల్పించకుంటే విధులెలా నిర్వహించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వసతులు మెరుగుపరిస్తేనే పుష్కర విధులు నిర్వర్తిస్తామని కానిస్టేబుళ్లు తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News