: వారెవ్వా... 10 లక్షల మంది స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు


ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది వంట గ్యాస్ సబ్సిడీని వదిలేసుకున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. యూపీలో 2.09 లక్షల మంది సబ్సిడీని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానాన్ని మహారాష్ట్ర కైవసం చేసుకుంది. ప్రతి వినియోగదారుడికి పెట్రోలియం సంస్థలు ఏడాదికి 12 సిలిండర్ల చొప్పున అందిస్తాయి. అయితే, ఒక్కో సిలిండర్ పై ప్రభుత్వం రూ. 207 సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. దీంతో, ప్రభుత్వంపై ఏటా రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో, సంపన్నులంతా సబ్సిడీని వదులుకుని... మరో పేద కుటుంబానికి ఆ అవకాశాన్ని కల్పించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విన్నవించారు. ఈ పిలుపుకు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది.

  • Loading...

More Telugu News