: ఇసుక ‘తుఫాన్’పై చంద్రబాబు దృష్టి...మరికాసేపట్లో రెవెన్యూ శాఖ ప్రతినిధులతో భేటీ
ఏపీలో ప్రభుత్వం, రెవెన్యూ ఉద్యోగులకు మధ్య దూరాన్ని పెంచిన ఇసుక ‘తుఫాన్’పై సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన ముగించుకున్న ఆయన మొన్న సాయంత్రం ఢిల్లీ చేరుకుని నిన్న రాత్రిదాకా అక్కడే గడిపారు. హైదరాబాదు చేరుకున్న ఆయన మరికాసేపట్లో రెవెన్యూ శాఖ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఘటనపై ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించిన చంద్రబాబు, రెవెన్యూ శాఖ ఉద్యోగులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.