: తహశీల్దారే ‘హద్దు’ దాటారట... కొత్త మలుపు తిరిగిన ఏపీ ఇసుక వివాదం!


ఏపీలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల సంఘం మధ్య ఎడతెగని వివాదానికి తెరలేపిన ఇసుక వివాదం కొత్త మలుపు తిరిగింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షి తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఇసుక ట్రాక్టర్లకు అడ్డంగా పడుకున్న వనజాక్షి, ఇతర సిబ్బందిపై చింతమనేనితో పాటు ఆయన అనుచరులు దాడికి దిగారు. వనజాక్షిని కింద పడేసి తొక్కేయడంతో పాటు రెవెన్యూ సిబ్బంది చొక్కాలు చిరిగేలా కొట్టారు. దీనిపై భగ్గుమన్న రెవెన్యూ ఉద్యోగులు చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందేనని మూడు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఘటన జరిగిన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లాలోనిదేనని సర్వే అధికారులు తేల్చారు. అంతేకాక, ఇసుక అక్రమ రవాణా జరిగిన ప్రాంతం కూడా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనిదేనని తేలింది. తన మండల పరిధినే కాక తాను పనిచేస్తున్న మండలం ఉన్న కృష్ణా జిల్లా సరిహద్దులు దాటి వెళ్లాల్సిన అవసరం వనజాక్షికి ఏమిటనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తహశీల్దార్ పై చర్యలు తప్పవన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News