: అజయ్ తో ఎలాంటి పాత్ర అయినా చేస్తా: టబు
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సరసన ఎలాంటి పాత్రలో అయినా నటిస్తానని ప్రముఖ నటి టబు తెలిపింది. దక్షిణాది భాషల్లో విజయం సాధించిన 'దృశ్యం' సినిమా బాలీవుడ్ వెర్షన్ లో అజయ్ దేవగణ్, శ్రియ దంపతులుగా నటిస్తుండగా, పోలీసు అధికారిణిగా టబు నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టబు ఈ వ్యాఖ్యలు చేసింది. శ్రియ మాట్లాడుతూ, తల్లి పాత్ర పోషించడం ఏమాత్రం కష్టం కాదని చెప్పింది. అయితే ఈ పాత్ర తనకు కాస్త కొత్తగా ఉందని తెలిపింది. సినిమా అభిమానులను అలరిస్తుందని వీరిద్దరూ విశ్వాసం వ్యక్తం చేశారు.