: చైనా, గ్రీస్ లలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం మాపై ప్రభావం చూపలేదు: టీసీఎస్


యూరప్ దేశం గ్రీస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆసియా పెద్దన్నగా చెప్పుకునే చైనా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ మాట్లాడుతూ, ఆయా దేశాల్లో తలెత్తిన సంక్షోభం తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. ఈ త్రైమాసికంలో యూరప్ లో తమ వ్యాపారం మరో 19 శాతం పెరిగిందని టీసీఎస్ అధికార ప్రతినిధులు తెలిపారు. అమెరికా, యూరప్ లతో పోలిస్తే చైనాలో తమ వ్యాపార భాగస్వామ్యం చాలా తక్కువని చెప్పారు.

  • Loading...

More Telugu News