: టీఆర్ఎస్ లో చేరితే ఓకే అట.. లేకపోతే నిధులు కూడా ఇవ్వరట: టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై పగబట్టిందంటూ మరో టీటీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రావాల్సిన నిధులను ప్రభుత్వం ఆపేసిందని... ఆ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ లో చేరితే వ్యవహారం మొత్తాన్ని ఐదు రోజుల్లో చక్కబెడతామంటూ ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తాను, రేవంత్ రెడ్డి ఇద్దరం టీడీపీ ఎమ్మెల్యేలమే కావడంతో ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని చెప్పారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి గతంలోనే అనుమతులు మంజూరయ్యాయని... భీమా నుంచి రూ. 1400 కోట్లతో 18 టీఎంసీల నీటిని తరలించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వెల్లడించారు.