: చింతమనేనిని అరెస్టు చేయకపోతే బీజేపీకి కూడా చెడ్డపేరు వస్తుంది: కావూరి
మహిళా తహశీల్దార్ పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిని బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఖండించారు. వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీడీపీతోపాటు బీజేపీకి కూడా చెడ్డపేరు వస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు సదుద్దేశంతో డ్వాక్రా గ్రూపులకు ఇసుక రీచ్ లు ఇస్తే వారిని అడ్డం పెట్టుకుని చింతమనేని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి అరాచక శక్తులను చంద్రబాబు ఉపేక్షించకూడదని చెప్పారు. ఇలాంటి ఘటనలను ముందుగా కట్టడి చేయకుంటే రాజకీయాల్లో నేర శక్తులు పెరిగిపోతాయని హెచ్చరించారు.