: యువరాజ్ విన్నపాన్ని మన్నించిన సచిన్
ఔత్సాహికులకు సాయపడడంలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎల్లప్పుడూ ముందు ఉంటాడు. తాజాగా, లండన్ లో 20 మంది అండర్-17 క్రికెటర్లను కలిసి వారికి కిటుకులు బోధించాడు. ఆ క్రికెటర్లు యువరాజ్ సింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అకాడమీకి చెందిన వారు. ప్రత్యేక శిక్షణ కోసం వారు లండన్ వచ్చారు. వింబుల్డన్ కోసం సచిన్ లండన్ లోనే ఉన్నాడన్న సంగతి తెలుసుకున్న యువీ వెంటనే ఆయనను సంప్రదించాడు. తన శిష్యులకు టెక్నిక్స్ బోధించాలని కోరాడు. తనకు వీర విధేయుడైన యువీ విజ్ఞప్తికి సచిన్ వెంటనే ఓకే చెప్పేశాడు. ఆ యువ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా విఖ్యాత లార్డ్స్ స్టేడియంలో నెట్ సెషన్ నిర్వహించి తన అనుభవసారాన్ని వారికి పంచాడు.