: తహశీల్దార్ పై దాడి ఘటనలో... రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం సుముఖం


కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిపై దాడి ఘటనలో పలువురిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడలో రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే వంశీతో చర్చించారు. ఉద్యోగులు చేసిన డిమాండ్లలో నాలుగు డిమాండ్లకు ఒప్పుకున్నామని ఉమా తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు మినహా... ఆయన గన్ మెన్, ముసునూరు ఎస్పై విజయ్ కుమార్ పై శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు, తహశీల్దార్ పై దాడిచేసిన ఆరుగురిని సాయంత్రంలోగా అరెస్టు చేసేందుకు, వనజాక్షిపై పెద్దవేగిలో నమోదైన కేసు ఎత్తివేతకు అంగీకరించినట్టు ఉమా తెలిపారు. కాగా ఎమ్మెల్యేను అరెస్టు చేసే విషయంపై సీఎం వచ్చాక చర్చిస్తామని రెవెన్యూ ఉద్యోగులు తెలిపారు.

  • Loading...

More Telugu News