: మైండ్ బ్లోయింగ్... రికార్డులు బద్దలవుతాయి: బాహుబలిపై ప్రభాస్ పెద్దమ్మ స్పందన


'బాహుబలి' చిత్రాన్ని సీనియర్ నటుడు కృష్ణంరాజు అర్ధాంగి, హీరో ప్రభాస్ పెద్దమ్మ థియేటర్లో వీక్షించారు. అనంతరం ఆమెను మీడియా స్పందన కోరగా, థియేటర్లోంచి పైకి లేచి రావాలనిపించలేదని చెప్పుకొచ్చారు. సెకండ్ పార్ట్ కోసం థియేటర్లోనే ఉండిపోవాలనిపిస్తోందని అన్నారు. చిత్ర యూనిట్ కు పేరుపేరునా ఆమె హేట్సాఫ్ చెప్పారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా ధాటికి హాలీవుడ్, టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయని ఉద్వేగంతో చెప్పారు. ఇక, ప్రభాస్ యాక్షన్ గురించి చెప్పాల్సి వస్తే "మైండ్ బ్లోయింగ్" అన్నారు. తన కొడుకు అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News