: రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే తప్పుడు కేసులు పెడుతున్నారు: భూమా
తెలుగుదేశం పార్టీపై వైకాపా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విరుచుకుపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే, తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పట్టును సాధించడం కోసం... తనను ఎలాగైనా ఇరికించాలని టీడీపీ యత్నిస్తోందని అన్నారు. తనను, తన కుటుంబాన్ని, చివరకు కార్యకర్తలను కూడా పోలీసులు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ, కర్నూలు జిల్లా ప్రజలకు తనను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తమపై వేధింపులు ఆపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.