: మా బ్రదర్ హిట్ కొట్టాడు... యూనిట్ కు ఇక మెమెంటోలు అక్కర్లేదు: ఎస్ఎస్ కాంచీ


భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న జానపద చిత్రం 'బాహుబలి' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై దర్శకుడు రాజమౌళి సోదరుడు, రచయిత ఎస్ఎస్ కాంచీ స్పందించారు. తన సోదరుడు మరో హిట్ కొట్టాడని ఎంతో మురిసిపోయారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇది గర్వించదగ్గ సినిమా అని అభివర్ణించారు. అన్నయ్య కీరవాణి, అమ్మ (వదిన శ్రీవల్లి) ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని, వారి కష్టం ఫలించిందని అన్నారు. సినిమా హిట్ నేపథ్యంలో, యూనిట్ సభ్యులకు మెమెంటోలు అక్కర్లేదని వ్యాఖ్యానించారు. ప్రేక్షకుల అభిమానమే వారికి మెమెంటో అన్న కోణంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి భారతీయ సినిమా విలువను ప్రపంచానికి చాటారని కాంచీ కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News