: రష్యా వేదికగా మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ... ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు
భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. రష్యాలోని ఉఫా నగరం వారిద్దరి సమావేశానికి వేదికైంది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలైన సరిహద్దు వివాదాలు, కాశ్మీర్ లో పాక్ దుందుడుకు చర్యలు, ముంబయి దాడుల సూత్రధారి లఖ్వీని పాక్ విడుదల చేయడం, బహుళ ప్రయోజన వీసాలు, బ్యాంకుల ఏర్పాటు, శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలపై రెండు దేశాల ప్రధానులు చర్చించే అవకాశముంది. నిన్న రాత్రే అక్కడి భోజన సమయంలో ఇద్దరు ప్రధానులు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం విశేషం. మరోవైపు భారత్, పాక్ ప్రధానుల భేటీని అమెరికా స్వాగతించింది. రెండు దేశాల అధినేతలు సమావేశమై చర్చించుకుంటేనే సమస్యలు తొలగిపోతాయని గతంలో అమెరికా పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా భేటీపై అగ్రరాజ్యం సంతోషం వ్యక్తం చేస్తోంది.