: నేడు ఇస్రో 'బాహుబలి'!


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలోనే అత్యంత 'బాహుబల' వాణిజ్య ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నేటి రాత్రి 9:58 గంటలకు పీఎస్ఎల్వీ-సీ28 వాహక నౌక ద్వారా ఒకేసారి ఐదు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) ఇందుకు వేదికైంది. ఇప్పటికే మొదలైన కౌంట్ డౌన్ సజావుగా సాగుతోందని శాస్త్రవేత్తలు వివరించారు. గతంలో చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్ లను ప్రయోగించినప్పుడు వినియోగించిన ఎక్స్ ఎల్ రకం వాహకనౌకనే ఇప్పుడూ ఉపయోగిస్తోంది. రాకెట్ నింగిలోకి ఎగసిన 19.16 నిమిషాల్లో చివరి ఉపగ్రహం విడిపోతుందని అధికారులు తెలిపారు. ఐదు ఉపగ్రహాల్లో మూడు డీఎంసీ 3 ఆప్టికల్ భూ పరిశీలన ఉపగ్రహాలు. వీటితో పాటు సీబీఎన్టీ-1, డి ఆర్బిట్ సెయిల్ పేరిట మరో రెండు చిన్న ఉపగ్రహాలూ ఉంటాయి.

  • Loading...

More Telugu News