: ఎల్బీ నగర్ విజయలక్ష్మి థియేటర్ పై ‘బాహుబలి’ ఫ్యాన్స్ దాడి..పలువురికి గాయాలు


టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ ప్రదర్శితమవుతున్న థియేటర్లపై ప్రేక్షకుల దాడులు కొనసాగుతున్నాయి. మొన్న రాత్రి విశాఖలో మొదలైన ఈ దాడుల పర్వం తాజాగా హైదరాబాదుకు చేరుకుంది. ఎల్బీనగర్ లోని విజయలక్ష్మి థియేటర్ పై కొద్దిసేపటి క్రితం ప్రేక్షకులు దాడికి దిగారు. థియేటర్ యాజమాన్యం టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటోందని ఆరోపించిన ప్రేక్షకులు థియేటర్ పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు ధ్వంసమవడమే కాక ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News