: అమెరికా డ్రోన్ దాడుల్లో ఐఎస్ఐఎస్ డిప్యూటీ మృతి


ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఐసిస్ డిప్యూటీని అమెరికా డ్రోన్ దాడుల్లో మట్టుబెట్టింది. పాకిస్థాన్ తాలిబాన్ కి ప్రతినిధిగా వ్యవహరించిన షాహిద్ పాకిస్థాన్ జాతీయుడు. తాలిబాన్ గ్రూపులో రేగిన విభేదాల కారణంగా ఐఎస్ఐఎస్ లో చేరాడు. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన ఆఫ్ఘనిస్తాన్ లోని నన్ గర్హార్ ప్రాంతంలో పెద్దఎత్తున తీవ్రవాదులు తలదాచుకుంటున్నారు. దీనిని పసిగట్టిన అమెరికా డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో షాహిద్ తో పాటు, 24 మంది తీవ్రవాదులు మృతి చెందారు. షాహిద్ మరణాన్ని నిర్ధారిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీస్ అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News