: పవన్ ఆవేశపరుడే కానీ మంచివాడు... వర్మ వ్యాఖ్యలు సరికాదు: సోమిరెడ్డి
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. పవన్ పై ఆ విధంగా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. పవన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు వర్మ వరుసబెట్టి విమర్శనాత్మకంగా ట్వీట్లు చేయడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు పవన్ ను కించపరిచేలా ఉన్నాయని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ ఆవేశపరుడే కావచ్చు కానీ, మంచివాడని అన్నారు. పవన్ ను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని పవన్ మాట్లాడాలని సోమిరెడ్డి సూచించారు. ఇక, పవన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని తెలిపారు.