: జపాన్ పర్యటన సక్సెస్: యనమల
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన ముగించుకుని ఇవాళ ఢిల్లీలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు జపాన్ లో పర్యటించిన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పర్యటన వివరాలను మీడియాకు తెలిపారు. జపాన్ పర్యటన విజయవంతం అయిందని అన్నారు. రాష్ట్రంలో పలు రంగాల్లో పెట్టుబడులకు జపాన్ వర్గాలు ఆసక్తి ప్రదర్శించాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తాము జపాన్ ప్రతినిధులకు వివరించామని చెప్పారు.