: తహశీల్దార్ ను ఎమ్మెల్యే కొట్టారా?...ఆగస్టు 13 లోగా నివేదిక ఇవ్వండి: హెచ్చార్సీ
విధులు నిర్వర్తిస్తున్న మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడ్డారా? లేదా? అనే దానిపై ఆగస్టు 13 లోగా పూర్తి నివేదిక అందజేయాలని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ (హెచ్ఆర్సీ) కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ఇసుక తరలింపు వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి దిగినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై పెను వివాదం చెలరేగింది. రాష్ట్రంలోని ఎమ్మార్వోలంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన ఎమ్మార్వోలు, పుష్కరాలను బహిష్కరిస్తామని ప్రకటించారు. దీనిని సుమొటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ ఆగస్టు 13 లోపు నివేదిక అందజేయాలని ఆదేశించింది.