: కేసీఆర్, జగన్ కలిసి కుట్ర చేస్తున్నారు: సెబాస్టియన్
తమ ఫోన్లను ట్యాప్ చేశారని, తమపై కుట్రపన్ని కావాలనే కేసుల్లో ఇరికించారని 'ఓటుకు నోటు' కేసులో నిందితుడు సెబాస్టియన్ ఆరోపిస్తున్నారు. ఏసీబీ అధికారులు చెబుతున్నట్టు తన ఫోన్ లో ఎలాంటి రికార్డులు లేవన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని అవినీతి నిరోధక కార్యాలయానికి సెబాస్టియన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలసి ఈ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ వ్యవహారాలన్నీ జనార్దన్ చూస్తారని, ముఖ్యమంత్రిని తాము సరాసరి కలవలేము కాబట్టి, సమస్యలు ఏమైనా వుంటే జనార్దన్ కు చెప్పుకుంటామని సెబాస్టియన్ అన్నారు.