: లండన్ లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లోకల్ రైళ్లు
భూగర్భ రైల్వే వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం సమ్మె బాట పట్టడంతో, లండన్ లోని లోకల్ రైళ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. లండన్ లోకల్ లో ప్రయాణించేవారంతా భూగర్భ రైలునే వినియోగిస్తారు. రైళ్లు ఆగిపోవడంతో ఆఫీసులకు వెళ్లేవారు, వ్యాపారాలకు వెళ్లేవారు చాలా ఇబ్బంది పడ్డారు. లండన్ వెళ్లిన టూరిస్టులు సైతం ఈ సమ్మెతో అవస్థలు పడాల్సి వచ్చింది. లండన్ లో ప్రతి రోజు సుమారు 40 లక్షల మంది లోకల్ రైళ్లను వినియోగిస్తారు. ఈ క్రమంలో, కొన్ని రూట్లలో 24 గంటలూ రైళ్లను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సిబ్బంది మొత్తం సమ్మె బాట పట్టారు.