: సెల్ఫీ మోజుతో మరో ప్రాణం బలి!


వయసుతో సంబంధం లేకుండా అందరికీ అంటిన సెల్ఫీల పిచ్చి కొన్నిసార్లు ప్రాణ నష్టానికి కారణమవుతోంది. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో మృతి చెందారన్న వార్తలు వింటున్నా, కొందరు సాహసాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా, రష్యాలో అన్నా కృపేనికోవా (21) అనే యువతి ఓ బ్రిడ్జిపై నిలుచుకుని సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు 40 అడుగుల కిందికి పడిపోయింది. దాంతో, ప్రాణాలు విడిచింది. టూరిజం గ్రాడ్యుయేట్ అయిన అన్నా ఓ ఫ్రెండ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునేందుకు మిగతా మిత్రులతో కలిసి విహారానికి బయల్దేరింది. వారు ప్రయాణిస్తున్న బస్సు ఓ వంతెన వద్దకు రాగా, అక్కడి ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు బస్సును ఆపి కిందికి దిగారు. ఈ క్రమంలోనే అన్నా సెల్ఫీ మోజుతో బలైపోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఒకవేళ అన్నా మద్యం సేవించి ఉందేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తమలో ఎవరూ మద్యం తాగలేదని అన్నా మిత్రులు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News