: కజక్ ప్రజలను సంతోషపెట్టేందుకు మోదీ అబద్ధాలు చెబితే ఎలా?: శంకర్ సింగ్ వాఘేలా


ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా ధ్వజమెత్తారు. కజకిస్థాన్ ప్రజలను సంతోషపెట్టేందుకు ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పరాదని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ ముస్లింల సంప్రదాయ టోపీని తలపై ధరించేందుకు విముఖత ప్రదర్శించారని, ఇప్పుడు కజకిస్థాన్ వంటి మధ్య ఆసియా దేశాల్లో పర్యటిస్తూ, ఇస్లాం సంస్కృతిని వేనోళ్ల కీర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో ముస్లిం వ్యతిరేకిగా ప్రవర్తించిన ఆయన ఇప్పుడు మరోలా మాట్లాడడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమేనని దుయ్యబట్టారు. ఇప్పుడు అకస్మాత్తుగా మధ్య ఆసియా ప్రాంతంపై అనురాగం ఎందుకు ప్రదర్శిస్తున్నట్టు? అని వాఘేలా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News