: ఆగస్టు 15 లోపు ఉగ్రదాడి... డ్రోన్లను నిషేధించిన ముంబై పోలీసులు


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగడానికి ముందు ఇండియాపై ఉగ్రదాడి జరగవచ్చని ముంబై పోలీసులు హెచ్చరించారు. ఆగస్టు 15కు ముందు ఎప్పుడైనా ఈ దాడికి అవకాశముందని తెలిపారు. రిమోట్ నియంత్రణలో పయనించే డ్రోన్ల సాయంతో దాడులు జరగవచ్చన్న అనుమానాలతో వాటిపై నిషేధాన్ని విధించారు. కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ లో లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ ను రావల్పిండి జైలు నుంచి విడుదల చేసిన తరువాత నిఘా వర్గాలు ఇవే తరహా హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా మరోసారి ముంబైపై విరుచుకుపడవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అన్ని ముఖ్య ప్రాంతాల్లో నిఘా పెంచిన ముంబై పోలీసులు అణువణువూ తనిఖీలు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News