: తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అమిత్ షా ఆగ్రహం


తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో టీఎస్ నేతలు విఫలమవుతున్నారని ఆయన భావిస్తున్నారు. హైదరాబాదులో కొంతమేర బీజేపీ బలంగా ఉంటే... రాష్ట్రమంతా అలాగే ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు భావిస్తుండటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇలా అయితే, 2019లో తెలంగాణలో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందని అమిత్ ప్రశ్నించారట. హైదరాబాదులో కూర్చొని అంతా బాగుందని అనుకుంటే సరిపోదని, తగు కార్యాచరణను రూపొందించుకుని క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారట. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఎన్నో అవకాశాలున్నా... వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమవుతున్నారని అమిత్ భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News