: టీడీపీ ఎమ్మెల్యే వీధి రౌడీలా వ్యవహరించారు... తక్షణమే అరెస్టు చేయాలి: పార్థసారథి


కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దార్ పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఓ టీడీపీ ఎంపీ సైనికులను అవమానపరిచేలా మాట్లాడితే, టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపైనే దాడి చేశారన్నారు. అయినా ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభాకర్ ఎమ్మెల్యేగా గాకుండా వీధి రౌడీలా దౌర్జన్యానికి పాల్పడ్డారని పార్థసారథి విమర్శించారు. ఇక మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు 'నీరు-చెట్టు' కార్యక్రమంలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, అందుకే అధికారులపై ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News