: దెబ్బలు తిన్న తహశీల్దార్ పై కౌంటర్... పెదవేగి పీఎస్ లో కేసు నమోదు


కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనలో తహశీల్దార్ ఫిర్యాదుతో ముసునూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదైంది. తాజాగా తహశీల్దార్ పై కౌంటర్ కేసు నమోదైంది. నిబంధనలకు లోబడే ఇసుక తరలిస్తున్న తమపై తహశీల్దార్ వనజాక్షి తన సిబ్బందితో కలిసి అకారణంగా దాడి చేశారని డ్వాక్రా మహిళలు పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పెదవేగి పోలీసులు వనజాక్షిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News