: ‘బాహుబలి’ ఫ్యాన్స్ దాడిలో మూడు సినిమా థియేటర్ల ధ్వంసం
టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయలేదన్న కారణంగా విశాఖలో మూడు సినిమా థియేటర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నగరంలోని దొండపర్తిలోని శ్రీకన్య, 104 ఏరియాలోని లక్ష్మీనరసింహ, కంచరపాలెంలోని ఊర్వశి థియేటర్లపై ఈ దాడి జరిగింది. విశాఖలో ‘బాహుబలి’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల జాబితాలో ఈ థియేటర్లు లేవు. దీంతోనే ‘బాహుబలి’ ఫ్యాన్స్ గా భావిస్తున్న వ్యక్తులు ఈ థియేటర్లపై దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.