: మత్తయ్య బాటలో జిమ్మీబాబు!... ఏపీలో దాక్కున్నాడంటున్న టీ ఏసీబీ
ఓటుకు నోటు కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన తెలుగు యువత నేత జిమ్మీబాబు కూడా ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య బాటలో నడుస్తున్నారట. కేసు నమోదు కాగానే మత్తయ్య ఏపీకి పారిపోయారని తెలంగాణ ఏసీబీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మత్తయ్య అరెస్ట్ కోసం శతథా యత్నించిన ఏసీబీ అధికారులు హైకోర్టులో భంగపాటుకు గురయ్యారు. తాజాగా జిమ్మీబాబు కూడా మత్తయ్య మాదిరే ఏపీకి పారిపోయారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కేసులో జిమ్మీబాబు ప్రమేయాన్ని ప్రాథమికంగా నిర్ధారించుకున్న ఏసీబీ, ఆయనను ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో జిమ్మీబాబు కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇప్పటికే తాము జారీ చేసిన నోటీసులకు స్పందించని జిమ్మీబాబు, తమకు మస్కా కొట్టి ఏపీకి పారిపోవడంపై ఏసీబీ అధికారులు గుర్రుగా ఉన్నారట.