: బెనజీర్ భుట్టో భర్తగానే జీవిస్తా, అలాగే చనిపోతా: పాక్ మాజీ అధ్యక్షుడు


అమెరికాకు చెందిన తన్వీర్ జమానీ అనే వైద్యురాలిని తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ వచ్చిన వదంతులను పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఖండించారు. ఈ మేరకు తన అధికార ప్రతినిధి ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. షాహీద్ బెనజీర్ భుట్టో భర్తగా, షాహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో అల్లుడిగా ఉండేందుకే జర్దారీ గౌరవంగా భావిస్తున్నారని తెలిపారు. 'ఈ గౌరవం ముందు మిగతా ఏదైనా తాను ఇష్టపడనని' ఆయన తెలిపినట్టు అధికార ప్రతినిధి పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. అంతేగాక జర్దారీకి వివాహం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలకు సదరు వైద్యురాలే కారణమని నిందించారు. ఇదిలాఉంటే, పాక్ లో కొన్ని మీడియా నివేదికల ప్రకారం జర్దారీకి తన్వీర్ తో రెండేళ్ల కిందటే రహస్యంగా పెళ్లైందని, వారికి సజవాల్ అనే కుమారుడు కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News