: జ్వాల నన్నెందుకు లక్ష్యం చేసుకుందో తెలియదు: పుల్లెల గోపీచంద్


భారత బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. తనపై వచ్చిన విమర్శలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జ్వాల ఎందుకు తనను లక్ష్యం చేసుకుందో తెలియడం లేదని అన్నారు. టాప్ ప్రోగ్రామ్ లో జ్వాల, అశ్విని పేర్లు చేర్పించేందుకు ఎంతో కృషి చేశానని అన్నారు. ఇందు కోసం స్పోర్ట్స్ అధారిటీ డీజీతో మాట్లాడానని గోపీచంద్ తెలిపారు. జ్వాల వ్యాఖ్యలు సాయ్, బాయ్, టాప్ ఖండించడం ద్వారా తన నిజాయతీని గుర్తించినట్టైందని గోపీచంద్ వ్యాఖ్యానించారు. తిరిగి విమర్శలు చేయడం లేదని అలుసుగా తీసుకోవద్దని గోపీచంద్ సూచించారు. జ్వాల తనకు చిన్నప్పటి నుంచి తెలుసని పేర్కొన్నారు. జ్వాల, అశ్వినిలకు పూర్తి సౌకర్యాలు అందజేశామని, అందువల్లే వారు ఇప్పుడున్న స్థానానికి చేరుకున్నారని గోపీచంద్ స్పష్టం చేశారు. మెడల్ గెలుచుకోగానే స్పోర్ట్స్ అధారిటీ అధికారులు స్వాగతం పలికారని, వారిని అభినందిస్తూ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారని, ఆ డిన్నర్ లో తాను పాల్గొన్నానని ఆయన గుర్తు చేశారు. డిన్నర్ లో పాల్గొంటే అభినందించినట్టు కాదా? అని ఆయన ప్రశ్నించారు. అయినదానికీ, కానిదానికీ నిందించడం సరికాదని ఆయన హితవు పలికారు. తనపని ఏదో తాను చేసుకుపోతానని, అది అందరికీ తెలుసని, వివాదాలు తనకు ఇష్టం ఉండదని గోపీచంద్ స్పష్టం చేశారు. ఆమె విమర్శించింది కదా అని విమర్శలు చేయలేనని గోపీచంద్ తెలిపారు.

  • Loading...

More Telugu News