: పుట్టిన రోజు కానుకగా 'బిగ్గెస్ట్ డీల్స్' ఇస్తామంటున్న అమెజాన్


తాము వ్యాపారాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈనెల 15న కనీవినీ ఎరుగని ఆఫర్లతో కూడిన డీల్స్ ప్రకటిస్తామని అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ డాట్ కాం ప్రకటించింది. గతంలో తామిచ్చిన బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండేను మించిన డీల్స్ కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. జూలై 15 అర్ధరాత్రి నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రతి పది నిమిషాలకూ కొత్త డీల్స్ ప్రకటిస్తామని, 'సెవెన్ పాప్యులర్ డీల్స్ ఆఫ్ ది డే'తో పాటు వేలాది ఆఫర్లను దగ్గర చేస్తామని సంస్థ ఉపాధ్యక్షుడు గ్రెగ్ గ్రీలీ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాధాన్యతా కస్టమర్లు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రైమ్ మెంబర్ కానివారు తక్షణం చేరిపోయి ఈ డీల్స్ పొందవచ్చని తెలిపారు. కాగా, అమెజాన్ లో ప్రాధాన్యతా సభ్యుడిగా కొంత మొత్తం చెల్లించి చేరితే, ఉచిత డెలివరీతో పాటు మరిన్ని డీల్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైమ్ మెంబరుగా చేరాలంటే 99 డాలర్లు (సుమారు రూ. 6,270) చెల్లించాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News