: డబ్బు ముఖ్యం కాదు... అది నన్ను ప్రభావితం చేయలేదు: రాజమౌళి


భారత చలనచిత్ర రంగంలో భారీ చిత్రంగా పేరుగాంచిన 'బాహుబలి' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం విడుదలకు ముందు విశేష ప్రచారం పొందింది. దీనిపై దర్శకుడు రాజమౌళి మీడియాతో ముచ్చటించారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, సినిమా క్రియేటివిటీ కోణంలో హిట్టయితే అదే తనకు ఆనందమని పేర్కొన్నారు. తాము పడ్డ కష్టానికి గుర్తింపు లభించినప్పుడే ఘనవిజయం సాధించినట్టు భావిస్తానని చెప్పుకొచ్చారు. బాక్సాఫీసు అంకెల కంటే 'సృజనాత్మక సంతృప్తి'కి ప్రాధాన్యాత ఇస్తానని స్పష్టం చేశారు. ఇక, బాహుబలి చిత్రానికి 'మహాభారతం' బలమైన ప్రేరణగా నిలిచిందని తెలిపారు. కురుక్షేత్ర యుద్ధం తనను బాగా ఆకట్టుకుందని చెప్పిన జక్కన్న, అమర చిత్ర కథలంటే ఎంతో మక్కువ అన్నారు. బాహుబలి సృష్టికి అమర చిత్ర కథలు కూడా దోహదపడ్డాయని పేర్కొన్నారు. బాహుబలి చిత్రాన్ని మహాభారతానికి నీరాజనంగా సమర్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News