: కేసీఆర్ తో పాటు నా పాత్ర కూడా ఉంది: డీఎస్


తెలంగాణను సాధించిన ఘనత టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని సీనియర్ నేత డి.శ్రీనివాస్ కొనియాడారు. ఈ రోజు ఆయన కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో కేసీఆర్ తో పాటు, తన పాత్ర కూడా ఉందని డీఎస్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్ ను చూసి, తాను చలించిపోయానని... దీంతో, తెలంగాణను ఇచ్చేలా సోనియాగాంధీని ఒప్పించానని తెలిపారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమ బాట పడితే, తాను రాజ్యాంగబద్ధంగా పోరాటం చేశానని చెప్పారు. సోనియాకు, కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉండటం వల్లే తెలంగాణ కల సాకారమయిందని తెలిపారు. కేసీఆర్ తో తన సంబంధం ఈనాటిది కాదని... మూడు దశాబ్దాల నుంచి ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. పార్టీ మారడం ఇబ్బందికరమే అయినప్పటికీ, బంగారు తెలంగాణ సాధన కోసమే టీఆర్ఎస్ లో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. హైదరాబాదులో ఉన్న వాళ్లంతా తెలంగాణ వారేనని... వారిని సెటిలర్లుగా తాము భావించడం లేదని డీఎస్ చెప్పారు.

  • Loading...

More Telugu News