: సెల్ఫీలు తీసుకుంటున్నారా?... అయితే జాగ్రత్తలు పాటించండంటున్న రష్యన్ పోలీసులు


ఈవేళ ఎక్కడ చూసినా సెల్ఫీల సందడే కనిపిస్తోంది. పైగా, దీనికి సందర్భం అంటూ లేకుండా కూడా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇలా సెల్ఫీ తీసుకోవడం... అలా ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్టు చేసేయడం! ఈ సరదా కాస్తా చాలామందికి చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. కారణం ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా సెల్ఫీ తీసుకోవడమే. రష్యాలో ఇప్పటివరకూ సెల్ఫీలు దిగుతూ 10 మంది చనిపోయారట. అంతేకాదు వందలమంది తీవ్ర గాయాలపాలయ్యారట. ఓ మహిళ మాస్కో బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటూ కిందపడి మరణించింది. మరో ఇద్దరు అమ్మాయిలు ఏకంగా రైలుపై నుంచి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి కరెంట్ షాక్ కు గురయ్యారు. అందుకే రష్యన్ పోలీసులు 'సేఫ్ సెల్ఫీ' ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సెల్ఫీలు తీసుకోవడంలో జాగ్రత్తలు చెబుతున్నారు. సెల్ఫీ పిచ్చితో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని, 'లైక్'ల కోసం ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు వివరిస్తున్నారు. మరి మీరు కూడా సెల్ఫీ విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు కదూ?

  • Loading...

More Telugu News