: 'బాహుబలి'పై వివాదం, ఆ సీన్లు తొలగించాలంటున్న మాలల జేఏసీ


జక్కన్న చెక్కిన శిల్పం 'బాహుబలి'పై ఓ వివాదం చెలరేగుతోంది. ఈ సినిమాలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలు, మాటలు ఉన్నాయని, వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ డిమాండ్ చేసింది. యూట్యూబ్ లో మాలలను కించపరుస్తూ ఉన్న ఈ క్లిప్పింగ్స్ సేకరించి పోలీసులకు అందిస్తూ, ఇప్పటికే ఫిర్యాదు చేశామని జేఏసీ చైర్మన్ బి. దీపక్ కుమార్ వివరించారు. ఈ దృశ్యాలను తొలగించకుంటే చిత్రాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News