: చిన్నా... నువ్వు అచ్చెన్న అంత ఎత్తు ఎదగాలి: కుమారుడితో కేటీఆర్!
ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిది భారీ కాయం. ఎత్తుకు తగ్గ లావుతో ఆయన ఆజానుభావుడిలా కనిపిస్తారు. అచ్చెన్న రూపం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను బాగా ఆకట్టుకున్నట్టుంది. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన తేనీటి విందుకు కుమారుడితో కలిసి హాజరైన కేటీఆర్, నేరుగా అచ్చెన్న దగ్గరికి వెళ్లారు. కుమారుడికి అచ్చెన్నను పరిచయం చేసి ‘‘చిన్నా.. నువ్వు కూడా అచ్చెన్న అంత ఎత్తు ఎదగాలి’’ అంటూ చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇటీవల పెరిగిన అంతరాలను పక్కనబెట్టిన కేటీఆర్ ఇలా తన కుమారుడికి అచ్చెన్నను ఆదర్శంగా చూపడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది.