: నవ్యాంధ్రకు రానున్న తోషిబా, హోండా!
జపాన్ పర్యటనలో భాగంగా బుధవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే తోషిబా సంస్థతో చర్చలు ముగించిన ఆయన, హోండా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నవ్యాంధ్రలో విద్యుత్ నిర్వహణపై తోషిబా ప్రతినిధులు ఆసక్తిని చూపారు. తాము విద్యుత్ సరఫరాలో నష్టాలను 10.3 శాతం వరకూ తగ్గించామని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ఎనర్జీ వర్శిటీ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని తోషిబాను ముఖ్యమంత్రి కోరారు. స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ పవర్ మేనేజ్ మెంటుపై తోషిబా ప్రజెంటేషన్ ఇవ్వగా అది బాబుకు నచ్చిందని తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా గ్రిడ్ పై పనిచేయాలని ఈ సందర్భంగా తోషిబాను ముఖ్యమంత్రి కోరారు. అందుకు తోషిబా సైతం అంగీకరించినట్టు తెలుస్తోంది. వాహన తయారీ ప్లాంటును ఏపీలో ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన అన్ని వసతులు, ఏర్పాట్లు చేస్తామని బాబు హామీ ఇచ్చారు. దీనిపై హోండా ప్రతినిధి బృందాన్ని పంపుతామని చెప్పినట్టు అధికారులు తెలిపారు.