: మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి బంధువుల ఇంటిలో దొంగలు పడ్డారు!
మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి బంధువుల ఇంటిలో దొంగలు పడ్డారు. హైదరాబాదు, జూబ్లీహిల్స్ లో నేటి ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనలో దాదాపు రూ.కోటికిపైగా విలువ చేసే నగలు, నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. చోరీని గుర్తించిన దినేశ్ రెడ్డి బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం చోరుల కోసం వేట మొదలుపెట్టారు. ఇటీవలి కాలంలో జూబ్లీహిల్స్ పరిధిలో చోరీలు పెరిగిపోతున్నాయి. ప్రముఖుల ఇళ్లను టార్గెట్ చేస్తున్న చోరులు కోట్లాది రూపాయల విలువ చేసే సొత్తును అపహరిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.