: అక్కడ నాలుగంతస్తుల ఎత్తు నుంచి పిల్లల్ని కిందపడేస్తారు... అదో ఆచారం!


మన దేశంలో కొన్ని చోట్ల ప్రజల నమ్మకాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. స్వామీజీ తొక్కితే పెళ్లిళ్లు జరుగుతాయని కొన్ని ప్రదేశాల్లో నమ్ముతున్నట్టే, నాలుగంతస్తుల ఎత్తు నుంచి పిల్లల్ని కిందికి విడిచేస్తే వారిని అనారోగ్యం దరిచేరదని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని కొన్ని చోట్ల నమ్ముతారు. మహారాష్ట్రలోని బాబా ఉమర్ దర్గా, కర్ణాటకలోని నాగ్రాలా గ్రామంలో దిగమేశ్వర గుడిలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో సుమారు 700 సంవత్సరాలుగా ఓ సంప్రదాయాన్ని అక్కడి ప్రజలు మతాలకు అతీతంగా ఆచరిస్తున్నారు. సుమారు 15 మీటర్ల ఎత్తు నుంచి నెలల పసికందు మొదలు రెండేళ్ల లోపు పిల్లలను జారవిడుస్తారు. వారిని కిందనున్నవారు పట్టుకుంటారు. అలా చేస్తే, శక్తి, ఆరోగ్యం కలుగుతాయని స్థానికులు నమ్ముతున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని, ఈ సంప్రదాయాన్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ, స్థానికులు పట్టించుకోకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News