: అంతా ఓకే...విమానంలో బాంబు లేదు
మలేసియా రాజధాని బ్యాంకాక్ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కు వెళ్తున్న టర్కిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో బాంబు ఉందన్న అనుమానంతో హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించిన సంగతి తెలిసిందే. విమానంలో బాంబు ఉందన్న ఫిర్యాదుతో సీఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్, ఎన్ఐఏ, స్పెషల్ కమెండోలతో పూర్తి స్థాయిలో ప్రమాద నివారణకు సిద్ధమైన భద్రతా బలగాలు, విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ముందుగా 140 మంది ప్రయాణికులను విమానంలోంచి కిందకు దించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని నిర్ధారణ కావడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే బాంబు ఉందని పైలట్ కు ఎలా తెలిసిందని ప్రశ్నించడంతో, విమానంలోని బాత్రూంలోని అద్దంపై విమానంలో బాంబు ఉన్నట్టు లిప్ స్టిక్ తో రాసిన రాతల ఆధారంగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.