: జపాన్ లో చంద్రబాబుకు హారతితో స్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు


జపాన్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు అక్కడి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ రోజు అక్కడ కొంతమంది తెలుగువారిని కలిసేందుకు సీఎం వెళ్లిన సమయంలో మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పలువురు మహిళలు, చిన్నారులతో సరదాగా మాట్లాడారు. ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు? అని కుశల ప్రశ్నలు వేశారు. ఇదే సమయంలో చంద్రబాబుతో కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారు కనిపిస్తారన్నారు. తెలుగుజాతి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎన్టీఆర్ కలలు కన్నారని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News